Keep Smiling.....:)
"వ్యాకరణం రాజబాట వేస్తుంది.వాడుక పిల్లబాట తొక్కుతుంది"అని కాళోజి అన్నట్టు,నా భాష తెలుగు,యాస తెలంగాణ.నేను రాసేదాంట్ల english,తెలుగు రెండూ ఉంటయ్.నేనెట్లైతె మట్లాడ్తనో,అట్లనే రాస్తా...."

Saturday, May 14, 2011

జ్ఞాపకాలు: నేను-నా పిల్లలు


"అన్నా",.అని ఆ పిల్లలు వచ్చి పిలవంగానే ఒక రకమైన సంతోషం,చిరాకు,"అబ్బా...వచ్చిండ్రా..",అనే యాష్ట తో పాటు రెండు గంటలు నన్ను నేను మర్చిపోయి నా చిన్నప్పటి "నన్ను" చూసుకోవచ్చు అనే ఆనందం,..అన్ని భావనలూ కలిగేవి నాకు...

సరిగ్గా 5 గంటలకు నా 9 మంది పిల్లలు వచ్చి నా నెత్తి మీద నాట్యం చేయడానికి తయారు ఉండెటోల్లు (ఆ...ఆ....మీ వెకిలి నవ్వుకి అర్థం తెల్సింది గాని,..."నా పిల్లలు అంటే నేను tuitions చెప్పిన పిల్లలు అని").ఇచ్చట అన్ని రకాల వస్తువులు లబించును అన్న రీతిలో,..నా దగ్గర వచ్చే పిల్లల్లో ౩ ఏళ్ళ చిన్ని పాప నుండి 15 ఏళ్ళ బాబు వరకు అంతా ఉండేవారు.ఒక "complete package " లెక్క ఉండేటిది.

అసలు ఈ tuitions చెప్పుడు అన్న ఆలోచన నాకెప్పుడు లేదు.ఆ మాటకొస్తే మనకంత ఓపిక అసలే లేదు,మరి మనం "పరమ బద్ధక చక్రలం" కదా!
మా apartments లో మస్తు మంది పిల్లలు ఉండేవాళ్ళు.ఎప్పుడూ వాళ్ళ లొల్లి తో సందడిగా ఉండేది.మా watchmen భార్య ఆ పిల్లలందరినీ రోజూ తిట్టుడు,వాళ్ళు వినకుండా apartments లో ఇష్టం వచ్చినట్టు ఆడుకునుడు చాలా మామూలు విషయం అయిపొయింది.
ఒకరోజు బయట నుండి వస్తున్న నన్ను ఆపి,.ఆమె,.."బాబు నీకు పుణ్యం ఉంటది,జర మా వానికి సదువు చెప్పయ్యా,..ఏం సదువడు,ఒకటే ఆటల్ల వడ్డడు..."అని ఇంకా ఏదో అనబోతుంటే,.."సరే,ఎమన్నా doubts ఉంటే రమ్మను చెప్తా" అన్నాను.
"అట్లా కాదు బాబు,రోజుకో గంట చెప్పయ్యా,..బాంచన్"అంది.
మనకి మాత్రం అంత ముఖ్యమైన పనులేమ్మున్నాయని...గంటనే కదా.."సరే రమ్మను" అని చెప్పి ఒక బాబుకేనా,పాప కి వద్దా" అని అడిగిన.
"మా వోడు ప్రైవేటు బడి,పిల్లనేమో govt బడి,ఆడపిల్ల దానికెట్లైన ఎం లేదు గాని వీడే సదవాలే" అని అన్నది.
పంపితే ఇద్దరిని పంపు,..చదువుకు ఆడ,మగ ఏం లేదు,ఇద్దరికి చెప్తా అని చిన్న ఉపన్యాసం ఇచ్చి వచ్చేసిన.

ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ఆ ఇద్దరు పిల్లలు పుస్తకాలు పట్టుకొని మా ఇంటికి వచ్చిండ్రు.బాబు 8వ తరగతి(ఇంగ్లీష్ మీడియం),పాప 5వ తరగతి(తెలుగు మీడియం),..కాని,మన బాబుకి ఆంగ్లము అరముక్క రాదు,..పాప కి వర్ణమాల అంటే ఏందో తెలవదు(5వ తరగతి కి ఎట్లా వచ్చిందో సర్కారు బడినే అడగాలి మరి!)..ఒప్పుకున్నాక తప్పుతుందా అనుకొని సమాధానపడ్డాను!

మర్నాడు సాయంత్రం ఆ ఇద్దరి పిల్లలతో పాటు ఇంకోడు వచ్చి చేరిండు."ఎవరు నువ్వు,ఎందుకు వచ్చినవ్",.అని అడుగుతుండగానే మా పక్క apartment watchmen వచ్చి..."వీడు నా కొడుకు బాబు,6th class చదువుతుండు,ఆ ఇద్దరితోనే వీనికి జర చెప్పయ్యా,.."అని బతిలాడి వెళ్లిపోయిండు.సరే చెప్దాం అనుకునప్పుడు ఇద్దరైతే ఏందీ,ముగ్గురైతే ఏందీ అని అనుకొని అతనికీ చెప్పడం మొదలుపెట్టిన.

మరి ఈ విషయం ఎట్లా తెల్సుకుందో గాని,..ఆ మర్నాడే మా పనిమనిషి మా అమ్మ తో "బాబుని మా పిల్ల కి గూడా tuition చెప్పమనమ్మ,.౩ క్లాసు చదువుతుంది,ఇవాళ పంపిస్తా"అని చెప్పింది.చిన్న పిల్లనే కదా,..పంపమని మా అమ్మ చెప్పుడు,..ఆ రోజు సాయంత్రం ఆ చిన్న పిల్ల నా దగ్గరికి వచ్చుడు జరిగిపోయినయ్!"చిన్న పిల్ల" నే కదా అని ఎంత తక్కువ అంచనా వేసిన్నో తర్వాత అర్ధం అయింది ఆ పిల్ల చేసే అల్లరితో.

ఈ నలుగురికి చెప్తుండగానే ఇంకో అతను వచ్చి వాళ్ళ ఇద్దరి పిల్లలను తిసుకొచ్చిండు.అసలు ఆ పిల్లలకి ఎం చెప్పాలి అనే సందేహం వచ్చింది నాకు,ఎందుకంటె అందులో ఒక పాప 1st class,ఇంకో పాప కి ౩ ఏళ్ళు.అంత చిన్న పాపకి ఎందుకు అని అడిగితే,.."వచ్చే ఏడాది స్కూల్ ల చేర్పిస్తం కదా,..కొంచం అలవాటు అయితదని,..నువ్వేం చెప్పకు బాబు,..ఒరికే కూసోనీ అంతే,..abcdలు పెట్టియ్ రాస్తది"అన్నాడు.ఆ పాప మస్తు ముద్దుగా,బొద్దుగా,తెల్లగా ఉండటంతో,..రోజు ఆడుకోవచ్చు కదా అని "సరే" అన్నాను.నేను ఎంత శ్రద్ధగా abcd లు పెట్టించేవాడినో,.దానిని అంతే శ్రద్ధగా తుడిపేసి,భక్తితో నాకు సమర్పించేది ఆ చిన్ని పాప!
ఒక 20 రోజుల తరువాత ఒక ముగ్గురు,..ఆ తరువాత మరో ఇద్దరూ,..అంతా కలిసి KG నుండి 10th క్లాసు దాక అందరూ వచ్చి చేరిండ్రు.
ఇట్లా గంట సేపు చెప్పే tuition సమయం,రెండు గంటలు చేయాల్సి వచ్చింది పిల్లలు పెరగటంతో.పెద్ద వాళ్ళకంటే చిన్న పిల్లలకి చెప్పటమే ఎక్కువ కష్టం అని అప్పుడు తెలిసింది.

చిన్న పిల్లలను పక్కన పెడితే,నా బుర్ర తినేటందుకు రోజు ఆరుగురు ఉండెటోల్లు.tuition మొదలైన పది నిమిషాలకే "అన్నా,..water,..","అన్నా,..urgent అన్నా,..ప్లీజ్ అన్నా,..","అన్నా,ఇవాళ మా స్కూల్ల టీచర్,..","అన్నా,..వీడు కొడుతుండన్నా....",..ఇట్లా రెండు గంటలు ఏదో ఒకటి చెప్పి,ఎట్లైనా చదువు తప్పించుకోవాలె అని చుసేటోల్లు.మొత్తానికి కష్టపడి వాళ్ళ homeworks చేయించి,చదివించి పంపించేటోడ్ని.

ఒకరోజు కొన్ని పదాలు notebookలో పెట్టించి "తొందరగా రాయి,లేకపోతే rub చేస్తా"అని అన్నాను ఒక పాపతో.అయిన కూడా మెల్లిగానే రాస్తుంది,మళ్లీ అట్లనే అన్నాను..వెంటనే,"ఇదేమన్న black board ఆ,..ఒరికే rub చేస్తా,rub చేస్తా అంటున్నావ్,ఇన్ని pages ఉన్నాయ్ చూడు,అందులో రాసుకోవచ్చు కదా"అని ఒక కౌంటర్ ఇచ్చింది.నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు!ఇట్లా ఏది మాట్లాడిన ఒక తింగరి సమాధానం తయారుగా ఉండేది మనోళ్ళ దగ్గర!ఇంకోసారి నాకు జ్వరం వచ్చి ఒక 4 రోజులు tuition చెప్పలేదు,..ఇంకా అప్పటినుండి నా "అనారోగ్యమే వాళ్ళ మహాభాగ్యం" అని అర్థం అయ్యి,.."అన్నా,..నీకు మళ్ళ జ్వరం ఎపుడు వస్తదన్నా,...",.."అన్నా,..వీడు నీకు జ్వరం వస్తే బాగుండు అంటుండన్నా...",..అని వాళ్ళ మనసులో కోరిక బయటపెట్టేటోల్లు.

ఇగ వాళ్ళ లొల్లిలు,వెకిలి నవ్వులు,నన్ను కావాలని అడిగే పిచ్చి ప్రశ్నలు,నేను ఎట్లైన కొట్టను అని తెలిసి నా దగ్గర గారాలు పోవుడు.....ఇట్లా హాయిగా గడిచిపోతున్న మా జీవితాల్లోకి తుఫాను లెక్క ఏప్రిల్ నెల వచ్చింది.పిల్లల parents వచ్చి,.."ఈ సారి మా వాడికి మంచి మార్కులు రావాలండి,..",.."ఈ సబ్జెక్టు లో చాలా weakగా ఉన్నాడు,ఎక్కువ చెప్పండి,.",..లాంటివి చెప్పిండ్రు,..నా శక్తీ మేరకు నేను కూడా కష్టపడ్డాను వాళ్ళకి అర్ధం అయ్యేలా చెప్పడానికి,.....exams వాళ్ళకైతే tension నాకు ఎక్కువ ఉండేది!!

ఎప్పుడూ పుస్తకం ముట్టని ఒక బాబు,నేను చెప్పినదంతా చేయడం,చదవడం మొదలుపెట్టిండు.
"పరిక్షలు అనేవరకే ఇంత బుద్ధి వచ్చిందేంది" అని నేను అడిగితే,...
"నాకు ఎప్పుడూ 390 మార్కులు వస్తాయ్ అన్నా,..ఈ సారి 450 తెచ్చుకుంటే మా అమ్మ నాకు laptop కొనిస్తా అంది"అని అసలు విషయం చెప్పిండు మనోడు.
7th క్లాసు చదివే వాడు laptop ఏం చేసుకుంటాడో అర్థం కాలేదు కాని,..10th లో 500 కన్నా ఎక్కువ మార్కులు వస్తే సైకిల్ కొనిస్తా అన్న మా నాన్న మాటలు గుర్తొచ్చాయి నాకు(నాకు మార్కులు వచ్చినా,సైకిల్ రాలేదు,అది వేరే విషయం!).
ఇట్లా బహుమతుల కోసమో,నా భయం తోనో,వాళ్ల శ్రద్ధ తోనో మొత్తానికి పరిక్షలు అన్ని రాసేసి,నాకు సెలవులు ఇచ్చేసిండ్రు పిల్లలు.ఆఖరి రోజు అందరికి choclates ఇచ్చిన,..ఆ choclates తీసుకున్న మూడేళ్ళ పాప ఆనందంతో నన్ను చూసి నవ్విన నవ్వు,....నేను నా జీవితంలో మరచిపోలేను!!

ఒక 15 -20 రోజుల తరువాత నేను బయటకి వెళ్తుంటే,అక్కడే ఆడుకుంటున్న పిల్లలు..."అన్నా,నాకు 85 %,..వీనికి 75 % అంతే" అని ఒకడు,.."అన్నా,..నాకు mathsలో 95 ,వీడికి 65 అంతే"అని ఇంకొకడు అరవడం మొదలు పెట్టిండ్రు."నీకెన్ని వచ్చినయ్?" అని ఇంకొక బాబుని అడిగితే..."478 వచ్చినయి అన్నా..కానీ మా అమ్మ ఇంకా laptop తేలేదు"అన్నాడు."అమాయకుడా,.పెద్దోళ్ళ గురించి నీకేం తెలుసు" అని మనసులో అనుకున్నాను."అన్నా,..thanks అన్నా.."అని గట్టిగా అరిచి,ఉరికి పోయిండ్రు!!

అన్నిటికన్నా నాకు సంతోషం కలిగించే విషయం,..వర్ణమాలతో నా దగ్గర తెలుగు నేర్చుకునుడు ప్రారంబించిన అమ్మాయికి,..తెలుగు లో 64 మార్కులు రావడం.....ఈ విషయంలో కొంచం గర్వ పడతాను కూడా......ప్చ్....అదో తుత్తి.....!!!!!

8 comments:

sirisha said...

nice........sweet memory.....
nee pillalu(tution) naaku telusu, nenu chusanu kada........

chaalaaaa bavundi..........

vivek said...

haha....yaa,..nuvu guest teacher vi kada vaallaki....:)

and Thank You!!! :)

param said...

చాలా బాగుంది!!
నీ జ్ఞాపకాలను చెప్పిన తీరు...

నువ్వు narrate చేసిన విధానం అని అనను... narrate చెయ్యడానికి ఇదేమి కధ కాదు కద!!
రియల్ లైఫ్ లొ మనం ఎంజాయ్ చేసిన విషయం చెప్పడానికి ప్రత్యేక పదాలు అవసరం లేదు!!
కానీ, నిజంగా హార్ట్ ఫుల్ గ రాసావు , అలాగే హార్ట్ ఫుల్ గ నవ్వుకున్నాం నేను మీ బావ... కీప్ ఇట్ అప్ !!

vivek said...

thank you so much akka...:)

Gouthami said...

chala baga raasav ra... nee tuition pillalu naaku inka gurthunnaaru... :)

vivek said...

marchipoye pillala vallu..hahahaa!! Thank uu so much akkaya...:)

Unknown said...

awesome dude!!!!

vivek said...

Thank you sujatha :D