2011 ,march 10 ,.ఎవరు,ఎందుకు అన్నది పక్కన పెడితే,..ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలను కూలగొట్టిండ్రు.తెలుగు జాతి గౌరవం మంటగలిసిందనీ,ప్రజాస్వామ్యం అపహాస్యం అయినదనీ,మహనీయులకి అవమానం జరిగిందని...ఇట్లా ఎందరో మేధావుల వ్యాఖ్యల నడుమ మళ్ళ విగ్రహాలు పెట్టిస్తాం అని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండ్రు.పాత విగ్రహాలే మల్ల పెడతం అన్నారు కానీ,..కొత్త విగ్రహాలు పెడుతం అన్న ముచ్చట మాత్రం చెప్పలే!
ఇంతకూ ట్యాంక్ బండ్ మీద విగ్రహం ఉండాల్నంటే ఏం అర్హతలు కావల్నో నా అట్లాంటోల్లకి అర్థం కాలే..(మీకు తెలిస్తే,నాకు చెప్పుండ్రి).కొమరం భీం,కాళోజి వంటి వారి విగ్రహాలు పెట్టాల్నని కొందరు ప్రభుత్వానికి సూచించినా..పెద్దగ పట్టించుకున్నట్టు లేరు!
నిజంగా కాళోజి గారికి ట్యాంక్ బండ్ మీద విగ్రహం కావాల్నా..?
ఏ తెలుగు రాజకీయ నాయకుడికి,కవికి దక్కని,.కేంద్ర ప్రభుత్వం గౌరవించి ఇచ్చిన భారతదేశ రెండవ అత్యున్నత పురస్కారం "పద్మవిభూషణ్" చాలదా?
అంతకుమించి ప్రజలు ఇచ్చిన "ప్రజా కవి" బిరుదు చాలదా?అందరూ "కాళన్నా" అని పిలిచే పిలుపు చాలదా?
హనుమకొండలో ఆయన పేరు మీద ఉన్న "కాళోజి రోడ్",వరంగల్ లో ఉన్న ఆయన నిలువెత్తు విగ్రహం,"కాళోజి ఫౌండేషన్" పేరుతో ఆయన అభిమానులు చేస్తున్న సాహిత్య సేవ చాలవా?
ఇన్ని గౌరవాలు దక్కిన ఆయనకు,రాజధాని లో విగ్రహం పెట్టుటానికి మాత్రం ఏ ప్రభుత్వానికీ దైర్యం రాలేదు ఎందుకో?ఇంతమంది ఇప్పుడు పెట్టుమని అడుగుతున్నా..ఇంకా దైర్యం వస్తలేదు ఎందుకోమరి..?!
కాళోజి అనంగానే,..తెలంగాణా ఉద్యమ కవితలకి మాత్రమే ప్రసిద్ధి అనే అపోహ కొందరికి ఉన్నది.అది ఎంత మాత్రం నిజం కాదు.ఆయన అప్పుడు రాసిన కవితలు ప్రస్తుత పరిస్థుతులకు కూడా అన్వయించుకోవచ్చు.దేశం లోని పేదల,సంపన్నుల స్వభావాలను తెలిపే ఈ కింది కవిత ఎన్ని సార్లు చదివితే,అన్ని సార్లు నాకు కొత్తగానే అనిపిస్తది..
"ఒకడు కుతికెల దాక మెక్కినోడు...
మరొకడు మింగ మెతుకు లేనోడు..
ఇద్దరికీ గొంతు పెకలదు,ఇద్దరికీ ఊపిరాడదు...ఒకే కారణం....'తినలేక',.."
తన సమకాలీకుడైన శ్రీశ్రీ మీద ఆయన షస్టి పూర్తి సభలో చదివిన ఈ కింది కవిత కాళోజి గారి చమత్కారానికి నిదర్శనం..
"నీవు రాసి పారేసిన కవితలు గుబాలిస్తున్నప్పుడు...
నువ్వు తాగి పారేసిన సీసాల కంపు మాకెందుకు?",..
అట్లనే నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారి చర్యలకు స్పందిస్తూ....
" 'కాసు' ఆటలోని గుట్టు 'కాళోజి' కనిపెట్టు" అని రాసిండ్రు ఇంకోకాడ!
"తప్పు దిద్దగా లేను,..దారి చూపగా లేను..
తప్పు చేసిన వాని దండిపగా లేను..
ఎందుకో నా హృదిని ఇన్ని వేదనలు.." అని ప్రతి హృదయాన్ని తాకినా మహానుభావుడు "కాళోజి".
ఇట్లాంటి ఆణిముత్యాలు ఎన్నో....
చివరకు 'సత్తుపల్లి' నియోజిక వర్గం నుండి పోటి చేసినప్పుడు కూడా....
"సత్తుపల్లి వోటర్ల సత్తువెంతో తేలాలే.." అని వోటర్లలో చైతన్యం నింపిన 'కాళన్న'ను కాలం మరచిపోతుందా..?
తెలంగాణా బాష,యాస మీద ఉన్న చిన్న చూపును ప్రశ్నిస్తూ..
"వాక్యం లో మూడు పాళ్ళు...ఇంగిలీషు వాడుకుంట...
తెలంగానీయుల మాటల్లో ఉర్దూ పదం దోర్లగానే..హీ హీ...అని ఇగిలించెడి సమగ్రాంధ్ర వాదులను ఏమనవలేనో తోచదు..",..
ఈ కవిత ఏ తెలంగాణా వాడికి చెప్పినా....."ఎంత సత్యం చెప్పిండే" అనే అంటారు ఇప్పటికీ...
ఇని నిజాలు చెప్పినందుకేనేమో ఆయనంటే రాష్ట్ర ప్రభుత్వానికి అంత చిన్న చూపు!'కాళోజి'ని తెలంగాణా కవి గానే చూసే మూర్ఖులకి లెక్క లేదు....!
కాళోజి ఒక కవి,ఒక రాజకీయ నాయకుడు,ఒక సంఘసంస్కర్త,ఒక స్వాతంత్ర సమరయోధుడు,తామ్ర పత్ర గ్రహీత,ఒక అనువాదకుడు,..అన్నిటికీ మించి....."ప్రజల మనిషి"!!
తెలుగు,ఇంగ్లీష్,ఉర్దూ,హిందీ,మరాఠీ భాషల్లో ఆయన రాసిన కవితలు మస్తు ఉన్నాయ్.మరి ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెట్టాల్నంటే ఇంతకన్నా ఏం అర్హతలు కావల్నో?!
పాఠ్య పుస్తకాల్లో శ్రీశ్రీ గురించి,విశ్వనాథ సత్యనారాయణ గురించి చదువుకున్నాం గాని...'కాళోజి' గురించి గాని,ఆయన కవితల గురించి గాని ఎక్కడా,ఏ పాఠ్య పుస్తకాల్లోనూ రాయలేదు,...ఎందుకో?!
ట్యాంక్ బండ్ మీద విగ్రాహాలు పగులగొట్టిండ్రు అని లొల్లి చేసినోల్లలో సగానికి సగం మంది అయినా,.."కాళోజి" విగ్రహం ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించినప్పుడే..."అంతా తెలుగువారమే" అని వారు వాడే వాక్యానికి అర్థం ఉన్నట్టు!తెలుగు గౌరవాన్ని కాపాడినట్టు! మన తెలుగు చరిత్రని మన భావి తరాలకు అందించినట్టు.
"చంద్రునికో నూలుపోగు" అన్నట్టు...నిజానికి కాళోజి గారి విగ్రహం ఉన్నా,లేకపోయినా,..పెద్ద నష్టం లేదు..కాని ఆ మహనీయున్ని అధికారికంగా గౌరవించడం ప్రభుత్వ బాధ్యత,గుర్తుచేయటం ప్రతి తెలుగు వాడి బాధ్యత...!
"శ్రీశ్రీ" పూర్తి పేరు "శ్రీరంగం శ్రీనివాసరావు" అని తెల్వనోల్లు,..శ్రీకృష్ణదేవరాయులు ఎక్కడి రాజో కూడా తెల్వనోల్లు,శాసనసభ్యులు,మేధావులు,ఆంధ్రప్రాంత రచయతల సంఘాలు....అందరూ కట్ట కట్టుకొని విగ్రహాల కూల్చివేతను ఖండిచిన్నట్టు....'కాళోజి' విగ్రహం పెట్టుమని గట్టిగ చెప్పరాదా?నోరు లేవదా?ఇట్లాంటి సమగ్రాంధ్ర వాదులకు,వలస పాలకులకు,'తెలుగు వారంతా ఒక్కటే' అని రాస్క పూస్క తిరిగేటోల్లకు.........
"కాళోజి కనిపిస్తలేరు"!!{అది తెలుగు జాతి చేసుకున్న దౌర్బాగ్యం,దురదృష్టం!}
"దోపిడీ చేసే ప్రాంతేతరులను దూరం దాక తన్ని తరుముదాం,.." అన్న కాళోజి కవిత ఇట్లాంటప్పుడే గుర్తుకొస్తది...అట్లా యాదికొస్తే తప్పు నాదా?
ఇద్దరూ సమకాలికులే అయినప్పుడు..'ప్రజాకవి' కి లేని విగ్రహం 'మహాకవి'కి ఎందుకు?
'కాళోజి' ని అర్థం చేసుకోలేని తెలుగు వారెందుకు?
వారిని గౌరవించలేని 'తెలుగుతనం' నాకెందుకు?
ఒక మహనీయుడిని సక్కగ గౌరవించలేని "సమైక్య తెలుగు రాష్ట్రం" లో "తెలుగు వాడి" గా ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను...!!!
2 comments:
Hmm! Just a couple of points -
- The statues you are talking about were erected in 1986-87, when Kaloji was very much alive. And, it is not an honor to erect statues for living people! I don't think they added any new statues after that - am not aware of the re-erecting part post the damage done recently!
- Why do you think the state government never paid respect to this great man? Am not sure if you are aware or nor, all the civilian honors given by the Central Govt. (Bharat Ratna and Padma awards) are given based on the recommendations from the State governments! So, it was indeed the govt at the State which recommended to the Center to give PadmaVibhushan to Sri Kaloji in 1992!
gud points,...
yes,ur right....those statues were erected in 1986-87 by the NTR's govt,..and kaloji was very much alive till 2002...and since 2007 many organizations inculdin kaloji foundation appealed to the govt to built a statue of kaloji in the state capital...n there was no response or immediate action taken by them on this issue...n as u said no new statues were added after 1986-87,this doesnt mean tat they can take tat as an excuse n stop builtin his statue or for tat matter,any other great personalities statues in the capital city...!
and yes,am very much aware that the state govt recommends the particular person for a civilization honour,..n he was awarded with "padmavibhushan" in the year 1992,much before than many other famous personalities...he was also the member of Andra Pradesh sahitya acadamy,and founder member for Andhra Saraswatha Parishath..if the state govt had enuf respect for the man,they would not have limited the honours wid juz a reccomendatin for an award....n they would nt have delayed in erecting a statue for him...!
And as u said u r unaware 'of the re-erecting part post the damage done recently',..govt has immediately announced,the very next day,i.e., on march 11th tat the broken statues will be re-built,its under process{this immediate response was not seen since 3-4 yrs abt komaram beem,kaloji's statues n the reason with them was that they lack funds!!!}...and atleast now,they can accept the demand n sensibilities of the people who want kaloji's statue in Hyderabad{to be built by the govt of AP} n can keep his statue along with the broken statues!
Post a Comment