నేను 6వ తరగతి లో ఉండగా రాసిన మొట్ట మొదటి పాట ఇది..చేసిన తొలి
రచన ఇది...మరి పాత సినిమాల ప్రభావమో,లేక అప్పట్లో వచ్చిన 'అన్నమయ్య'
సినిమా ప్రభావమో తెలవదు కాని...మొత్తానికి నా ఇష్టదైవం మీద నాలుగు వరుసలు
రాసి..ఏదో సాదించినట్టు అందరికీ ఈ పాట చూపించడం,నేనే ట్యూన్ చేసి,పాడి మరీ అందరికీ వినిపించడం( హింసించడం) నాకు ఇంకా గుర్తు.......
ఇక మీరూ చదవండి...
"వేంకటేశ్వరుని మహత్తు..
చూస్తేనే తెలియునా గమ్మత్తు...
శ్రీనివాసునికెందరో భక్తులున్నా...
కొందరితో చేస్తాడీ గమ్మత్తు..
ఎందరికో పెడతాడు పరీక్షలు..
అవి ఎన్నటికీ కావు మనకు శిక్షలు..
ఒక్కసారి మొక్కితే పోతుందా గీత,.బ్రహ్మ రాత..
పూర్వ జన్మలో ఉండొద్దు...పాపాల ఖాతా.."
ఇక మీరూ చదవండి...
"వేంకటేశ్వరుని మహత్తు..
చూస్తేనే తెలియునా గమ్మత్తు...
శ్రీనివాసునికెందరో భక్తులున్నా...
కొందరితో చేస్తాడీ గమ్మత్తు..
ఎందరికో పెడతాడు పరీక్షలు..
అవి ఎన్నటికీ కావు మనకు శిక్షలు..
ఒక్కసారి మొక్కితే పోతుందా గీత,.బ్రహ్మ రాత..
పూర్వ జన్మలో ఉండొద్దు...పాపాల ఖాతా.."
4 comments:
బాగుందండీ! మీరు ట్యూన్ కట్టి పాడినది కూడా పెట్టుంటే వినే భాగ్యం దక్కేది!
@రసజ్ఞ గారు...ధన్యవాదాలు...:)
హ హ హ....అందరి క్షేమం కోసం నేను పాడటం మానేసాను లెండి..అందుకే పెట్టలేదు..:)
చిన్నప్పటి విషయాలేవైనా సరే మంచి జ్ఞాపకాలవుతాయి... ముఖ్యంగా రచనలు లాంటి సృజనాత్మకమైన విషయాలైతే గుర్తుకు వచ్చినప్పుడల్లా యెంతో ఆనందాన్ని కూడా కలిగిస్తాయి. ఇది చదివిన వాళ్ళకి కూడా తమ తమ మధురస్మృతులు గుర్తు రాక మానవు. పంచుకున్నందుకు నెనర్లు.
పాపల కాత -> పాపాల ఖాతా, కదా? అర్థాలు మాఱిపోతున్నాయి అక్కడ! :P
@కిరణ్...నిజమే,ఇది చదివినప్పుడు మీ చిన్ననాటి విషయాలు గుర్తువచ్చి ఉంటాయ్ మీకు కుడా...అవి మాతో పంచుకుంటె సంతోషిస్తాం....:)
"ఖాతా" ని సరిచెసాను....ధన్యవాదాలు..
Post a Comment