సినిమా పాటల్లో స్త్రీని వర్ణించమనంగనే మన సినీ కవులు
వారిని దివిలో ఉండే పారిజాతాలుగానో,నింగి,నేల తానై నిండిన శక్తి గానో,జీవన
జ్యోతులు గానో,త్యాగ మూర్తులు గానో,ఎగసి పడే సముద్రం గానో,...ఇట్లా
రకరకాలుగా వర్ణిస్తూ ఉంటారు.
అయితే సిరివెన్నెల సీతరామశాస్త్రి గారు రాసిన "మహిళలు మహరాణులు" పాట వీటన్నిటికీ భిన్నంగా ఉండి,స్త్రీ తత్వాన్ని మొత్తం మన ముందు ఉంచుతది..ఆయనకు మాత్రమే సాధ్యమైన విద్య ఇది అనిపిస్తది ఇది చదువుతుంటే....."జాన జాన పదాలతో..జ్ఞాన గీతి పలుకునటే.." అని 'ఆపద్బాందవుడు' సినిమాలో ఆయనే రాసినట్టు..చిన్నోళ్ళు కూడా అర్దం చేసుకునే భాషలో,అంతే లోతైన భావంతో ఉంటది ఈ పాట.
ఈ పాటలో 'అతి' ఉండదు.....స్త్రీలని తిట్టినా,పొగిడినా అవి అందరూ ఒప్పుకునే నిజాలే...అసలు తిడుతుండ్రా పొగుడుతుండ్రా అని మనకి అర్దం కాదు..సిరివెన్నెల రాసిన నిందా స్తుతి గీతం అనంగనే గుర్తుకువచ్చే పాట "ఆదిభిక్షువు వాడినేది కోరెదీ..",అయితే అది ఒక్క దేవుని /ఒక వ్యక్తి లక్షణాలకి మాత్రమే పరిమతమయ్యే పాట...కాని ఈ పాట మాత్రం సృష్టిలోని స్త్రీలందరికీ ఆపాదించగలిగే పాట....
మనం గమనిస్తే,..ఒక వాఖ్యంలో స్త్రీలోని గొప్ప గుణాన్ని చెప్తూ,,..దాని వెనువెంటనే వచ్చే వాఖ్యంలో మహిళలోని మరో కోనాన్ని స్పృశిస్తూ అందంగా సాగిపోతుందీ గీతం...అంతే అందంగా పాడిండ్రు మన బాలు గారు.."ఆడదే ఆధారం" చిత్రం లోనీ ఈ పాటకి సంగీతం అందించింది శంకర్ గణేష్.
మహిళలు మహరాణులు...
పచ్చనైన ప్రతి కథకు తల్లి వేరు పడతులు..
భగ్గుమనే కాపురాల అగ్గి రవ్వ భామలు..
ఇంటి దీపమై వెలిగే ఇంధనాలు ఇంతులు..
కొంప కొరివిగా మారే కారణాలు కాంతలు.. ...మహిళలు మహరాణులు...
ఆశ పుడితే తీరు దాకా ఆగరు యెలనాగలు..
సహనానికి నేల తల్లిని పోలగలరు కొలతులు..
అమ్మగా లోకానికే ఆయువిచ్చు తల్లులు..
అత్తగా అవతరిస్తె వారే అమ్మతల్లులు..
ఆడదాని శత్రువు మరో ఆడదనే అతివలు..
సొంత ఇంటి దీపాలనే ఆర్పుకునే సుదతులు..
అర్ధమవరు ఎవరికీ ప్రశ్నలైన ప్రమదలు.. ...మహిళలు మహరాణులు...
విద్య ఉన్నా విత్తమున్నా వొద్దికెరుగని వనితలు..
ఒడ్డు దాటే ఉప్పెనల్లే ముప్పు కాదా ముదితలు
పెద్దలను మన్నించే పద్ధతే వద్దంటే
మానమూ మర్యాదా ఆగునా ఆ ఇంట
కన్నులను కరుణ కొద్దీ కాపాడే రెప్పలే
కత్తులై పొడిచెస్తే ఆపేదింకెవరులే
వంగి ఉన్నా కొమ్మలే బంగారు బొమ్మలు ...మహిళలు మహరాణులు...
ఇట్లా స్త్రీలనూ,వారి స్వభావాన్ని చెట్టువేరుతోనూ,అగ్గిరవ్వతోనూ,ఇంధనంతోనూ,కొమ్మలతోనూ పోలుస్తారు...ఈ పోలికలు ఒక ఎత్తు,కనురెప్పలతో పోల్చడం ఒక ఎత్తు అనిపిస్తది నాకు..సున్నితమైన స్త్రీలను..అంతే సున్నితమైన కనురెప్పలతో పొల్చడం ఎంత బాగుంది...!!
ప్రతి ఒక్కరూ తప్పకుండా వినవల్సిన పాట ఇది..
చివరగా,..'భారత ప్రభుత్వం' గనక నాదే అయితే...ఈ ఒక్క పాటకే సిరివెన్నెలకి "పద్మశ్రీ" ఇచ్చెటోడ్ని..!!

5 comments:
అదేమిటండీ కర్తికేయస్ గారు,
'భారత ప్రభుత్వం' గనక నాదే అయితే పద్మశ్రీ మాత్రమె అంటారు ?
'భారత ప్రభుత్వం' గనక నాదే అయితే పద్మ విభూషణ్ ఇచ్చి ఉందును అనండి!
అసలే తెలుగు వాళ్లకి పద్మలు ఇవ్వడం మర్చినట్టు ఉన్నారు భారత ప్రభుత్వం వారు.
కాబట్టి 'భారత ప్రభుత్వం' గనక నాదే అయితే టాప్ అవార్డ్స్ తోటే మొదలెడతాం !
చీర్స్
జిలేబి.
జిలేబీ గారు....మరీ ఒక్క పాటకి పద్మవిభుషన్ అంటే బాగుండదు అని "పద్మశ్రీ" తో సరిపెట్టిన..ఆయన అన్ని పాటలకీ కలిపి "పద్మవిభుషన్" ఇవ్వొచ్చులెండి...
నిజమే తెలుగు "పద్మాలు" ఎన్ని ఉన్నాయో...అసలు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఉందని ఎప్పుడో మర్చిపొయినట్టు ఉన్నారు... అది రాస్తే ఇంకో టపా అవుతుంది...:)
బావుందండీ . మంచిపాట గుర్తుచేసారు .
@లలిత గారు.....ధన్యవాదాలు..:)
ఒక్క ఆడవారిలోనే కాదండి... ప్రతీ విషయం లోనూ.. ప్రోస్.. కాన్స్... రెండూ ఉంటాయి....అందుకనే సిరివెన్నెల గారు.. రెండు రకాలుగా రాసారు...
Post a Comment