Keep Smiling.....:)
"వ్యాకరణం రాజబాట వేస్తుంది.వాడుక పిల్లబాట తొక్కుతుంది"అని కాళోజి అన్నట్టు,నా భాష తెలుగు,యాస తెలంగాణ.నేను రాసేదాంట్ల english,తెలుగు రెండూ ఉంటయ్.నేనెట్లైతె మట్లాడ్తనో,అట్లనే రాస్తా...."

Friday, March 27, 2009

చందమామ.......వెన్నెల........సావిత్రి...



ఎక్కడో చదివాను,....సావిత్రి గారి గురించి ఎంత చెప్పినా,ఎంత చదివిన ఏదో మిగిలిపోయి ఉంటుందని,,రాసే వాళ్ళకి ఇంకా ఏదో రాయాలని ఉంటుంది,చదివే వారికి ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది,..చందమామ,.వెన్నెల...వీటి గురించి ఎంత మంది ఎన్ని సార్లు వర్ణించినా మన తృష్ణ తీరుతుందా"....అని...నిజమే కదా...ఎంత బాగా రాసారు కవి....

నేను కూడా "మహానటి" ని గురించి రాద్దామని ఆలోచించాను....అసలు అంత గొప్ప నటి ని గురించి రాయటానికి నాకేం అర్హత ఉంది..??.... ప్రశ్నకి నాకు తోచిన సమాధానం ఒక్కటే..."నాకు అర్హత లేకపోవచ్చు,..కానీ ఆమె అంటే అభిమానం ఉంది,అంతకుమించిన గౌరవం ఉంది,...............టీవీ లో సావిత్రి గారి సినిమా వస్తుందంటే నేను వదిలి పెట్టిన సందర్బాలు చాలా తక్కువ.........

తోటలోని బంతిపువ్వులాగా నిండు గా, బొద్ధుగా ఉండే అందం, అమాయకమైన కళ్లు......నిజమైన తెలుగు అందానికి నిండైన రూపం ఆమె......అంత నిండు గా ఉండి కూడా ఎన్ని సినిమా లలో డాన్స్ లేకుండా కళ్ళతో యుగళ గీతాలకి అభినయించలేదు??........."కన్యాశుల్కం" లో "ఆనందం అర్ణవమైతే" అని వయ్యారాలు పోలేదు?......

తమిళుల ప్రతిస్టాత్మకమైన "నడిగర్ తిలగం" గౌరవం పొందిన మన తెలుగు "మహానటి" సావిత్రి....అయనా,ప్రపంచంలోని తెలుగు వారందరికీ తెలిసిన విషయాలు నేను ఇక్కడ మళ్ళి రాయటం నా అవివేకమే అవుతుంది,,..."సావిత్రి",.. మూడు అక్షరాల పేరుతో తెలుగు వారికి ఉన్నా అనుబంధం అలాంటిది మరి.....

మీరు ఎప్పుడైనా సావిత్రి గారి కృత్రిమ మైన నవ్వు నీ,..అసహజమైన నటననీ చూసారా?..అన్ని పాత్రలలోనూ "జీవించిన" సావిత్రి గారు అలా "నటించడం" కూడా మనం చూడవచ్చు....

నాగేశ్వరావు గారు హీరో గా 9 పాత్రలలో కనపడే "నవరాత్రి" సినిమా చుడండి..సావిత్రి గారి నటన అద్భుతంగా ఉంటుంది అని నేను రాయనవసరం లేదు.... సినిమా లో సావిత్రి గారు అనుకోకుండా ఒక నాటకం వేయవలసి వస్తుంది..ఇష్టం లేకపోయనా తప్పక నాటకం వేయటానికి ఒప్పుకుంటారు సావిత్రి గారు,..పాత్రలో జీవిస్తూ,నాటకం లో ఇబ్బంది కరంగా "కృత్రిమంగా నటిస్తూ ",వెటకారమైన మాటలతో సావిత్రి గారు చేసే కామెడీ అమోఘం,.... నాటకం లోని పాటని వారే స్వయం గా పాడతారు..అలా ఆమె గాత్రం వినే అదృష్టం కూడా మనకి లభిస్తుంది... నాటకం లో "ధామీ" అని అన్నప్పుడు మొహంలోని నిర్లక్ష్యం,చిన్నపాటి పొగరు,...చూడవలసిందే,..... విధంగా సావిత్రి గారు "నటించడం", మొదటి సారిగా,చివరి సారిగా చూడటం సినిమా లోనే........

ఎవరు అన్నారు ఒక్క సంగీతం లోనే సంగతులు ఉంటాయని...మన సావిత్రి గారి నటన లోనూ సంగతులు,గమకాలూ ఉన్నాయి...ఉదాహరణకి.....
"కలిసి ఉంటే కలదు సుఖం" సినిమా లో "ముద్దబంతి పూలు బెట్టి",.. పాటని చుడండి,...యిందులో "ఇంతకన్న ఉండెదేంది కిట్టయ్యా....ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా",..అని లైన్ ఉంటుంది,. లైన్ లోని ఒకో పదానికి ఒకో expression ఉంటుంది,..అంటే 6 పదాలకు 6 expressions పెడతారు,.....just imagine,its a 10 secs bit,n she will react to each n every word only with her eyes....{10 seconds-6 expressions}....ఇలా ఉన్నవి మరెన్నో.......
"అప్పు చేసి పప్పు కూడు" ఫిల్మ్ లో "సుందరాంగులను చూసిన వేలనే",.. పాట లో సావిత్రి గారి అభినయాన్ని చూడవలిసిందే,...ఇక "మాయ బజార్".లోని " అహ నా పెళ్ళియంట",...పాట గురించి నేను చెప్పేదేముంది,...మీకు తెలియదా??!!.....

ఇక "నర్తనశాల" లోని...."సఖియా వివరించవే",.."దరికి రాబోకు రాబోకు రాజా",..."జననీ శివకామిని",..... పాటలలో ఎక్కడ అజ్ఞాత వాసం లో ఉన్న ద్రౌపది పాత్రలోని విషాదం పోకుండా,....పాటలలోని సంధర్బాన్ని బట్టి విరహం,భక్తి,...ప్లే చేస్తూ అంతర్లీనంగా కళ్ళలో విషాద చాయలను చూపిస్తూ,..ఆమె నటించిన(?) తీరు.......................{ఇక్కడ ఏదన్నా కొత్త పదం వాడాలి,..మాటలని కనిపెట్టే అంత మేధస్సు నాకు లేదే??!!}.......

ఇలా పాత్రను ఆకళింపు చేసుకునే నటులు ఎంత మంది??.....అందుకేనేమో,..శ్రీ కృష్ణుడు అనగానే NTR,సత్యభామ అనగానే జమున గారు,నారదుడు అనగానే కాంతారావు గారు,....ద్రౌపది అనగానే సావిత్రి గారు తప్ప వేరొకలు గుర్తురారు!!
సావిత్రి గారి అమాయకమైన కళ్లు,అంత అందం,..వారి నటనలలో జీవించిన తీరుని మనం చూడకుండా చేస్తాయి....ఒకటికి రెండు సార్లు చూస్తేనే సావిత్రి గారి నటన కౌశలాన్ని మనం ఆస్వాధించగలం.....
--Karthikeya.....