Keep Smiling.....:)
"వ్యాకరణం రాజబాట వేస్తుంది.వాడుక పిల్లబాట తొక్కుతుంది"అని కాళోజి అన్నట్టు,నా భాష తెలుగు,యాస తెలంగాణ.నేను రాసేదాంట్ల english,తెలుగు రెండూ ఉంటయ్.నేనెట్లైతె మట్లాడ్తనో,అట్లనే రాస్తా...."

Wednesday, December 29, 2010

బ్రేకింగ్ న్యూస్


"రాజమండ్రి లో ఈదురు గాలులు,తుఫాను,..భారి వర్షాలతో భయాందోళనలో స్థానికులు...రాజమండ్రి కి పొంచి ఉన్న పెను ముప్పు,.."..ఈ వార్తలు చూసి పరేషాన్ అయ్యి వెంటనే రాజమండ్రి లో ఉన్న మా అక్కకి ఫోన్ చేశాను...

నేను:ఎలా ఉన్నావ్?

అక్క:సూపర్!

నేను:tv9 లో ఏదో చెప్తున్నాడు..ఈదురు గాలులు,భారి వర్షాలు మీ ఊర్లో అని..ఏమి లేవా...?!

"ఉక్క గా ఉందని శుబ్రంగా ఫ్యాన్ కింద కూర్చున్న"...అని పట పటా నవ్వేసింది మా అక్కయ్య..."
..

ఇది మన వార్తా చానళ్ళ హడావిడికి చిన్న ఉదాహరణ మాత్రమే...జనాలు కోరుకుంటున్నారని చిరంజీవిని పార్టీ పెట్టేలా చేసినా,YSR ది హత్యే అంటూ ప్రచారం చేసినా,రోశయ్య ను ఆపధర్మ ముఖ్యమంత్రి గానే అభివర్ణించినా,"ముసలోడికి దసరా పండగ" అంటూ Governor నే గద్దె దించినా,తెలంగాణా ఉద్యమాన్ని OU కే పరిమితం చేసినా,సమైక్య ఉద్యమాన్ని తెరమీదకి తెచ్చినా,tv anchor ల దగ్గరనుంచి జాతీయ నాయకుల దాకా,..ఎవరి మిద ఏ అపనింద వచ్చినా,అల్ప పీడనం దగర్నుంచి సునామి దాకా,దేని మీద ఏ వార్త వచ్చినా,.అందులో ముఖ్యంగా ప్రస్థావించవలసింది మన మీడియా పాత్ర గురించే,...

తెలుగు నాట ప్రస్తుతం ఉన్న దాదాపు 12 వార్తా చానళ్ళు వేటికవే ప్రత్యేకం.....మీకు పొద్దున లేవంగానే YSR గారి భజన,జగన్ అన్న యాత్ర చూడాలని ఉంటె సాక్షి టీవీ పెట్టుకోండి,..ఎవరైనా గొడవ పెట్టుకుంటే చూడటం మీకిష్టం అయితే వెంటనే NTV కి చూపు మార్చండి{అందులో మన కే.శ్రీనివాస్ గారు లైవ్ షో లు పెట్టి మరీ గొడవలు పెట్టడం లో దిట్ట},..ఇవేమీ కాదు,తెలంగాణా వార్తలు మాత్రమే కావాలంటే మన రాజ్ న్యూస్ పెట్టుకోండి,..మీరు సమైఖ్యాంద్ర గురించి వినాలంటే tv9,i-news ఇట్లాంటి చానెల్స్ పెట్టుకోండ్రి,ఇవేమీ కాదు,..నారా వారి{అదేలెండి TDP}వార్తలే కావల్నంటే studio-N చుడండి..,బడుగు,బలహీనులకే రాజ్యం,ఇలాంటి విప్లవ కధనాలు ఇష్టమైతే tv1 కి జై కొట్టండి,..ఇలా ఎవరి వార్తలు వాళ్ళు ప్రసారం చేసుకుంటూ,ఎవరి నేతలని వాళ్ళు పోగుడుకుంటూ వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి మన వార్త చానళ్ళు...

ఒకరోజు ప్రొద్దున్నే ABN ఆంధ్రజ్యోతి పెట్టగానే లక్ష్మిపార్వతి గారు ఏడుస్తూ ఉన్నారు,..ఆవేశంగా ఒకడ్ని బూతులు తిడుతున్నారు,..కాసేపు చూసాక అర్థం అయింది,.."రక్త చరిత్ర" సినిమా లో NTR ని కించపరచినందుకు బాధ పడుతూ,ఆ క్రియేటీవ్ డైరెక్టర్{ఇది కూడా టీవీ వాళ్ళ అభిఫ్రాయమే}ని తిట్టని తిట్టు తిట్టకుండా మార్చి మార్చి తిట్టేసారు{ఇంతకి ఈ లక్ష్మమ్మ అసలు సినిమానే చూడలేదట,tv9 లో వార్తలు చూసి,abn కి వచ్చి తిట్టే కార్యక్రమం పెట్టుకున్నారు}...ఆ "రక్తచరిత్ర" సినిమా పుణ్యమా అని బాలీవుడ్ లో ఎవరూ పట్టించుకోని వర్మ గారికి ఇక్కడ మంచి ఫోకస్ లబించింది..అసలు ఈ పిచ్చి నా కొడుకు{ఇది నా అబిప్రాయం కాదు బాబోయ్,..ఆ director గారే "జయప్రదం" సాక్షిగా తమను తాము అభివర్ణిస్తూ గర్వంగా చేసుకున్న పద ప్రయోగం}తీసే సినిమాల కు,మాట్లాడే మాటలకూ అంత సీన్ ఇవ్వాలా అని అనుకుంటుండగానే "wrong గోపాల్ వర్మ",..అని సాక్షి టీవీ సదరు డైరెక్టర్ గారి మీద ప్రోగ్రాం పెట్టి పిచ్చిగా,పచ్చిగా విమర్శలు గుప్పించింది...ఇలా ఒక 5-6 రోజులు మన టీవీ వాళ్ళకి రాంగోపాల్ వర్మ తప్ప ఎవరూ కనపడలేదు,..ఆ తర్వత జగన్ గారి యాత్ర, హై కమాండ్ ఆదేశాలు దిక్కరించే MLA ల లిస్టు తాయారు చేయడం లో గడిపేసారు..

ఇగ KCR గారు లగడపాటి కి i love u చెప్పారు అనే Breaking news తో ఒక 2 రోజులు ఊదరగొట్టాయి మన చానళ్ళు...
అసలు లైవ్ షో లో kcr గారు,లగడపాటి గారి సంబాషణ ఇలా సాగింది..

kcr:"తెలంగాణా వస్తే మీరు రాజకీయ సన్యాసం చేస్తా అన్నారు,.."

లగడపాటి:"అవును,దానికి నేను ఇప్పటికి కట్టుబడి ఉన్నాను,.."

kcr:"నాకు తెలుసు,..మీరు హీరో,మాట మిద నిలబడతారు,ఇదే మాట మీద ఉండండి,..i love u",..అని ఇట్లా abn చానల్ లో చర్చ సాగుతుండగానే,..

BREAKING NEWS:"లగడపాటికి I LOVE U చెప్పిన KCR",.."లగడపాటిని హీరో అన్న kcr",.."kcr స్వరం మారుతుందా,..తెలంగాణా ఉద్యమం నుండి kcr పక్కకు తప్పుకుంటున్నారా?,",..."kcr వ్యాఖ్యలతో నిరాశలో TRS శ్రేణులు,..KCR వ్యాఖ్యలను తప్పుపడుతున్న తెలంగాణా వాదులు",.. అని వేరే చానళ్ళలో breaking news వస్తూనే ఉన్నాయి...

అలాగే YSR ది హత్యే అని,..ఆ హత్య లో రిలయన్స్ అంబానీల హస్తం ఉందంటూ వచ్చిన కధనాల వల్ల reliance సంస్థలపై జరిగిన దాడులను రాజకీయ నాయకులు ఖండించడం,ప్రజలు అయోమయ పడటం తప్ప జరిగిందేమీ లేదు,..ఆస్తి నష్టం తప్ప..

ఇలాంటి breaking news గంట గంటకి వస్తూనే ఉంటాయి{చూసే వాడికి ఓపిక ఉండాలంతే}....తమకు కావలసిన రీతిలో వార్తలని ప్రసారం చేయడం వల్ల జరిగే నష్టాలను వీరు గుర్తించరో ,లేక మాకెందుకులే అని అనుకుంటారో మాత్రం తెలియరాదు....ఎందులో అయినా మంచి,చెడు ఉన్నట్టే,...వీటి వల్ల ఉపయోగాలు ఉన్నా,..అవి చాలా పరిమితం!!

{{ఇగ మన తెలుగు వార్తలలో "తెలుగు" గురించి మాట్లాడుకోవాలంటే ఒక గ్రంధమే రాయొచ్చు,..తెలుగుని ఎంత భ్రస్టు పట్టిస్తారో ఆ కోట్లు వేసుకున్న anchor లకే తెల్సు{ఈ విషయంలో గుడ్డి లో మెల్ల లెక్క ETV2 కొంచం నయం,ఇందులో breaking news లు ఉండవందోయ్,..."తాజా" అని తెలుగు లో రాస్తారు}...వార్త చానళ్ళ లోని "తెలుగు" గురించి పట్టించుకున్న పాపాన పోకండి,...మీకొచ్చిన తెలుగుని తెగులు పట్టిస్తారు అక్షర దోషాలతో...!!!!దానికన్నా బ్రేకింగ్ న్యూస్ లు చూడటమే ఉత్తమం...!!}}