Keep Smiling.....:)
"వ్యాకరణం రాజబాట వేస్తుంది.వాడుక పిల్లబాట తొక్కుతుంది"అని కాళోజి అన్నట్టు,నా భాష తెలుగు,యాస తెలంగాణ.నేను రాసేదాంట్ల english,తెలుగు రెండూ ఉంటయ్.నేనెట్లైతె మట్లాడ్తనో,అట్లనే రాస్తా...."

Friday, April 24, 2009

ఒక చిన్న మార్పు .....

ఇక ఆ Uniform తీసేసి ఎదన్నా పుస్తకం తీసి చదువు ..." ,
నేను స్కూలు మానేసినప్పుడల్లా అమ్మది ఇదే మాట .. చదువు వద్దు అనుకునే కద .." స్కూలు కి వెళ్ళను .." అని డాడీ తిట్టినా అమ్మ నసిగినా .. ఏడ్చి మరీ స్కూలు మానేసేది ...మళ్ళీ పుస్తకం తీసి చదువుకో అంటుంది ...అమ్మ కి నేను ఎప్పుడు అర్థం అవుతానో అని అనుకున్నాడు హేమంత్ .....

పుస్తకం తీసి చదువు అన్న అమ్మ మళ్ళీ తన గదిలోకి రావడం గమనిస్తూ తను కుక్క బెల్టు లా ఫీల్ అయ్యే టై ని మెల్లగా తీస్తున్నాడు ...
"అన్నయ్య ని చూసి బుద్ధి తెచ్చుకో , ఒక్క సారైనా స్కూల్ మానేస్తున్నాడా ...! సండే కూడా స్పెషల్ క్లాసులు పెట్టినా వెళ్తున్నాడు ... ఇలా ఐతే నువ్వెలా బాగుపడతావురా ..??" కోపం గా అంది వసంత .
కొంచం బాధగా మొహం పెట్టి uniform తీసేసి ... sincere గ బ్యాగ్ లోని పుస్తకాలు తీసి ముందు పెట్టుకున్నాడు హేమంత్.తన మాటలు కొంచెం పని చేసినందుకు .." పోనీలే ఇలా అన్నా చదువుతున్నడు అని సమాధానపడి వంటింట్లోకి వెళ్ళిపోయింది వసంత .

వసంత,,శ్రీరాం, ఇద్దరు కొడుకులు సుశాంత్ , హేమంత్ ...సుశాంత్ 8th క్లాస్ , హేమంత్ 4th క్లాస్ చదువుతున్నారు . ఎందుకో తెలీదు గానీ హేమంత్ కి sports మీద ఉన్న ఇంట్రెస్టు చదువు మీద లేదని వసంత ఎప్పుడూ బాధపడుతుండేది ... ఇక హేమంత్ వారానికి ఒక్కసారో , రెండుసార్లో స్కూలు మానేస్తానని గోల చెయ్యడం , వసంత తిట్టడం ... హేమంత్ మొండికెయ్యడం ఇంట్లో సాధారణమైపోయింది .....
Books ముందు పెట్టుకున్నాడు కానీ హేమంత్ కి ఎప్పుడు అమ్మ వచ్చి తనకి టిఫిన్ పెట్టే సాకుతో స్కూల్ కి వెళ్ళాలి అని చెప్పి బ్రతిమాలుతుందో అని ఆశగ ఎదురు చూస్తున్నాడు ...అమ్మ బ్రతిమాలిన తర్వాత ఆ రోజు తనకి freedom వచ్చినట్టు లెక్క ...ఆ తర్వాత తను టీవీ చూసినా, క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళినా అమ్మ ఏమీ అనదు ....
పుస్తకం లోకి చూస్తూ .." హమ్మయ్య అమ్మా నాన్నా తిడితే తిట్టారుగానీ ..ఈ రోజుకి స్కూలు బాధ తప్పింది .. ముఖ్యం గ Maths Class.., sagar sir ఎప్పుడూ నన్నే ఎందుకు Formulae అడుగుతాడో... ? నాకు రావు అని ఆయనకి ఖచ్చితంగ ఎలా తెలుస్తుందో ..?? మొన్న నన్ను ఆ మానస చేత లెంపకాయ వేయించాడు .. చిన్నగా వెయ్యమని చేప్తే నన్ను ఆ గున్నఏనుగు మానస నన్ను ఎంత గట్టిగ కొట్టింది ...!! Maths Period వస్తుంది అంటె ఆ గున్నఏనుగు నన్ను చూసి అదోలా నవ్వడం.. నేను తలదించుకోవడం .. ఇవన్నీ ఈ రోజు తప్పాయి ..అయినా నాకు స్కూల్లో జరిగే అవమానాలు అమ్మకి ఎం తెలుసులే..చెప్తే బాధపదుతుందని నేను నేను చెప్పకపొవడం వల్ల కానీ లేకపోతే అమ్మ నన్ను స్కూల్ మానిపించి cricket bat కొనిపెట్టేది ...


అదుగో టిఫిన్ వచ్చేసింది ... అమ్మ ఎంత మంచిదో...ఈ టైం లోనే కొంచెం బాధ నటించాలి .... మళ్ళీ స్కూల్ కి డుమ్మా కొట్టను అని అమంకి అబద్ధపు promise లు చెయ్యాలి ..ఇదంతా నాకు స్కూల్లో జరిగే అవమానాలు అమ్మానాన్నా దాకా రాకుండా చూస్కోడానికే కదా.. వాళ్ళ కోసం నేను ఇంత చేస్తునాను అంటే ఎంత బాధతో సంతోషపడతారో అని మనసులో అనుకుంటూన్నాడు ... ఇంతలో....

"మూడు దోశలు పెట్టాను .. వదిలెయ్యకుండా తిను.." అంది వసంత ... మనవాడు మాట్లాడలేదు,..ప్లేట్ ముట్టుకోలేదు ...
"చూడు నాన్నా స్కూల్ కి మానెయ్యకుండా వెళ్ళాలి , బాగా చదువుకోవాలి . గొప్పవాడివి కావాలి ... ఉండు నేనే తినిపిస్తా .." అంటూ మంచిమాటలు చెప్తూ తినిపించడం మొదలుపెట్టింది ...
అంతా అయ్యాకా...

" ఇంకెప్పుడూ స్కూల్ మానెయ్యద్దు సరేనా హేమూ...!!!" అని బుజ్జగించింది.
"ఇంకెప్పుడు మానెయ్యనమ్మా ...ఇదే last and final .." అన్నడు హేమంత్.
"నా బంగారమే!! , రా.. కొంచం సేపు టీవీ చూసి రిలాక్స్ అయ్యకా వచ్చి చదువుకుందువుగానీ ..." అని అంది.నాకు తెల్సు అమ్మ యిలా అంటుందని ... అమ్మ ఎప్పుడూ మారదు.. "అమ్మ ఎప్పుడూ అమ్మే " అని అనుకున్నాడు .
"అన్ని పుస్తకాలు సరిగ్గ సర్దుకోని టీవీ చూడు.. అల్లరి చెయ్యకూడదు ..నాకు చాలా పనులున్నాయి " అంది వసంత.
"సరే అమ్మా ..." సిన్సియర్ గా అన్నాడు హేమంత్.ఇంతలో డోర్ బెల్ మోగింది.... వసంతకి ఎదో గుర్తోచ్చింది ... మళ్ళీ మనవాడితో .."హేమూ..కళా ఆంటీ వచ్చినట్టుంది , నువ్వు ఈ గదిలోనే ఉండి చదువుకో ..." అని అంది.

అమ్మకి నానమ్మ అంటే భయం లేదు , నాన్న అంటే భయం లేదు , మా సాగర్ సార్ అన్నా భయం లేదు, పోనీ నేనంటే కూడా భయం లేదు ....!!! మరి నేను స్కూల్ మానేసి ఇంట్లో ఉన్నప్పుడు కళా అంటీ వస్తే భయపడుతుంది ఎందుఖో?? అది భయం కాదేమో ?? మొన్నటికి మొన్న నేను లోపల గదిలో చాక్లేట్ తింటూంటే .."ఇవ్వాళ హేమూ కడుపునొప్పి అంటూంటే స్కూల్ కి పంపలేద"ని చెప్పింది ... అవునులే బయట అన్ని అవమానాలు ధైర్యంగా ఫేస్ చేస్తున్న నేనే అమ్మకి అబద్ధం చెప్తున్నాను .. ఇక అమ్మ ఎంత !!!
అయినా ఈ కళా అంటీ కి ఎమీ పనీ ఉండదా ?? ఇంకాసేపయ్యాకా నేను చక్కగా cricket ఆడుకోవడానికి వెళ్తాను కదా .. అప్పుడు రావోచ్చుకదా ...!!ఇలా మనసులో ఆలోచించుకుంటూ మళ్ళీ తన బ్యాగ్ వంక చూసాడు .... " నా బ్యాగ్ అంత height,weight నేనెప్పుడు అవుతానో .. అమ్మ నాకు తెలియకుండా నా బ్యాగ్ కి complan ఇస్తుందా ??!! అని అనుకోని మళ్ళీ .. "చీ .. చీ,, నేనేంత చిన్నవాడిలా ఆలోచిస్తున్నాను.. బ్యాగ్ ఎక్కడన్నా కాంప్లాన్ తాగుతుందా ..?? అయినా అమ్మ అలా పార్షియాలిటీ చూపించదు ఆ సోషల్ మిస్ లాగ .. కాంప్లాన్ ఇస్తే ఇద్దరికీ ఇస్తుందని అనుకోని నవ్వుకున్నాడు ...!! కాసేపయ్యాకా....


"కళా ఆంటీ ఇప్పుడే వెళ్ళేలా లేదు ! " నేను ఎప్పుడు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తానో అని ఆశగా కిటికి నుండి గ్రౌండ్ వైపు చూస్తున్నాడు.
ఆ క్షణంలో తను సూపర్ మాన్ అయిపోతే ఎంతబాగుండును...ఈ పక్కన ఉన్న చెత్తకుప్ప దాటి రోడ్డు దాటి..ఒకే జంప్ లో గ్రౌండ్ లోకి వెళ్ళిపోయేవాడిని అని అనుకుంటున్నాడు .... ఇంతలో ఇంచుమించు తన వయస్సు ఉన్న ఒక అబ్బాయిని చూసాడు .....
"ఇతను కూడా నాలాగే స్కూల్ కి వెళ్ళలేదేమో ! .. మరి అలా ఉన్నాడేంటీ ?? ఆ పెద్ద సంచేమిటో..??..
"వీడు స్కూల్ కి వెళ్ళేవాడిలా అయితే లేడు ...కొంచం కూడా నీట్ నెస్ లేదు ...." అని మనసు లో అనుకుంటూ ఆ అబ్బాయిని గమనిస్తున్నాడు హేమంత్ ,
అతను అక్కడ ఉన్న చెత్తని తీసి తన సంచిలో వేసుకుంటున్నాడు .... "పాపం !! " అనుకున్నాడు హేమంత్ .

ఇంతలో ఆ బాబు తను నిన్న చీమలు పట్టాయని పారేసిన 5 స్టార్ చాక్లేట్ ని తీస్కోని తింటుండడం గమనించాడు .. కిటికిలోనుండే ...
" Hey! Don't eat that choaclate ... Thats Spoiled " అని గట్టిగా అరిచాడు , ఆ బాబు మనవాడికేసి చూసాడు కానీ , ఎమీ అర్థంకానట్టు మొహం పెట్టి ఆ చాక్లేట్ ని అపురూపం గా చూస్కుంటూ తింటున్నాడు ..!!
"ఇతనేంటి నన్ను పట్టించుకోవడంలేదు ?? ఇంగ్లీష్ అర్థం కాదేమో ... మరి అమ్మ కొత్తవాళ్ళతో ఇంగ్లీష్ లోనే మాట్లాడాలని చెప్పిందే !!?"

పోనీలే తెలుగులోనే అడుగుతాను అని అనుకొని .....
"ఒయ్ ... అది మంచి చాక్లేట్ కాదు , తింటే కడుపునొప్పి , జ్వరం వస్తాయి .., పాడేయి " అని అన్నాడు ... ఆ బాబు మాత్రం "బాగానే ఉంది " అని ఆ చాక్లేట్ ని మొత్తం తినేసాడు ...
ఆ బాబుని కిటికి దగ్గరకి రమ్మన్నాడు హేమంత్ ,,, అంత పెద్ద సంచితో కిటికి దగ్గరకి వచ్చి నిల్చున్నాడు ఆ బాబు ....

" నీకు జ్వరం వస్తుంది ... డాక్టర్ దగ్గర చూపించుకో..!!"
".......????!!! "
" మీ అమ్మా నాన్నలకి చెప్పు చెడ్డ చాక్లేట్ తిన్నాను అని వాళ్ళే నిన్ను తీస్కెళతారు ..."
" నాకు అమ్మా అయ్యా లేరు .." అన్నాడు ఆ బాబు .
".... !!!!?? మరి ఎలా పెరుగుతాడు ...? కాంప్లాన్ ఎవరిస్తారు ? దోశలు , అన్నము ఎవరు పెడతారు ?స్కూల్ కి వెళ్ళమనే వాళ్ళుండరు హాయిగా ... ఇలా మనసులో రకరకాలుగా ఆలోచిస్తూనే .... "ఎక్కడుంటావ్ ??? " అని అడిగాడు హేమంత్ ...
"ఊరి బయట పెద్ద పైపులలో ఉంటాం " అన్నాడు ఆ బాబు.
""పైప్స్ లోనా ...??? ఎంత మంది ఉంటారు మీ ఇంట్లో ??"

" నేను ,,,, నాతో పాటు 16 మందిమి , అందరం పిల్లలమే , కలసి ఉంటాం ".
" ఈ చెత్త ఎక్కడికి తీస్కెళుతున్నావ్ మరి ?? " అని అడిగాడు హేమంత్.
"మేము ఈ చెత్త తీస్కెళ్ళి మా సారు కి ఇస్తాము ,,,, ఆ సారు మాకు బన్ను , చాయ పోస్తాడు ... ఆ తర్వాత మేము పోయి పడుకుంటాం రోజూ ఇంథే .." అన్నాడు.
బన్ను అంటే ఎంటో అని అనుకున్నాడు హేమంత్ ...
" నీ పేరేంటి.." అని అడిగాడు .
"నాకు పేరు లేకుండె ... కానీ మా సారు నన్ను "మల్లేష్" అని పిలుస్తాడు .
మల్లేష్ అన్నమాట ఐతే .... అని ఇంకా ఎదో అడగబోతుంటే ...
"అన్నా ! చానా చెత్త ఉండె ...అదంతా తీస్కపొవాలె ... ఉంటా !!" అని చెప్పి మళ్ళి చెత్త కుండీ దగ్గరకి పోయి ఏరుకుంటున్నాడు ....


హేమంత్ అతనినే గమనిస్తునాడు.... అమ్మా నాన్నలేరు ..., పైప్ లో ఎలా ఉంటాడో..., పాపం !! అని ఏవేవో ఆలోచిస్తున్నాడు ఇంతలో ఆ బాబు కి చెత్తలో ఉన్న గాజుపెంకు గుచ్చుకోని బ్లడ్ రావడం గమనించాడు.... మల్లేష్ ఏడవలేదు ..., తనకు లాగ కేర్ తీస్కోని డెట్టాల్ బాండేజ్ ... వెయ్యాడానికి అతనికి అమ్మా నాన్నా ఎవరూ లేరు ...మల్లేష్ ఆ తెగిన వేలుని నోటిలో పెట్టుకోని వెళ్ళిపోయాడు ....హేమంత్ మాత్రం మల్లేష్ నే చూడసాగాడు ... అతను వెళ్ళిపోయిన తర్వాత పది నిముషాల దాకా కిటికిలో నుండి ఆ చెత్త కుండినే చూస్తూ ఉండిపోయాడు .


ఎందుకో తెలియదు ఆ రోజు హేమంత్ క్రికెట్ ఆడడానికి వెళ్ళలేదు , ఏమీ తినలేదు అమ్మ ఎంత బ్రతిమిలాడినా ...ఆ తర్వాత ఎప్పుడూ స్కూల్ మానలేదు ..చదువునీ , తనకి వచ్చిన అవకాశాల్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యలేదు ... అలాగని అతనెప్పుడూ టాపర్ గా లేడు ...బొటా బోటీ మార్కులతో ఏవరేజ్ స్టూడెంట్ గానే ఉన్నాడు ,,,,, ఈ మార్పు ఎందుకొచ్చిందో తెలియకపోయినా హేమంత్ చదువుతున్నాడు అని వసంత ఎంతో సంతోషపడింది .


*********************************************************


"అందుకే చెప్పాను రా... Brand Factory Outlet కి వెళ్దామని... నా మాట వినకుండా ఇక్కడకి తీస్కొచ్చావ్ " అన్నాడు కార్తీక్........

"సర్లే రా ఇప్పుడు వెళ్తున్నాం కద ... మూస్కోని కూర్చో !!!!" అన్నాడు హేమంత్ .

హేమంత్ ఇప్పుడు B.Tech కంప్లీట్ చేసాడు ..ఇంకో వారం లో U.S., వెళ్తున్నాడు , అందుకోసమే ఫ్రెండ్ తో షాపింగ్ చేస్తున్నాడు .

"అరే 9 Backlogs ఉన్న నీకు వీసా ఎలా ఇచ్చాడ్రా ??!!!" అన్నాడు కార్తీక్ హేమంత్ తో ....

"Thats Hemanth ...!!"అంటూండగానే కార్తీక్ ..."వావ్ ... అటు చూడరా ఆ అమ్మయి ఎంత సూపర్ గా ఉందో .. చూడరా చూడు ...!! " అని అరిచాడు ...బైక్ డ్రైవ్ చేస్తున్న హేమంత్ అప్రయత్నం గా అటువైపు తల తిప్పి చూసాడు ..సడన్ బ్రేక్ వేసాడు ....

"ఎరా అమ్మయి అంత నచ్చిందా ??1! " అన్నాడు కార్తీక్ .. కానీ అప్పటికే హేమంత్ మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది .అప్రయత్నంగానే అతని పెదవుల మీద మ...ల్లే,,,,ష్ .... అన్న పేరు వచ్చేసింది .నిజానికి హేమంత్ చూసింది ఆ అమ్మయిని కాదు .. ఆమె వెనుక చెత్త ఏరుకుని సంచిలో వేసుకుంటున్న చిన్నారి బాబుని .
హేమంత్ కి ఆ రాత్రి నిద్ర పట్టలేదు " మల్లేష్ ఇప్పుడు ఎం చేస్తునాడో ?? అతని తో కలసి ఉండే 16 మంది పిల్లలు ఏమయ్యారో ?? వాళ్ళు కూడా చదువుకొని ఉంటే నాలాగే మంచి పొజిషన్ లో ఉండే వారు కద !! " మల్లేష్ లాంటి పిల్లలు ఇంకా ఎంత మంది ఉన్నారో ఇప్పటికీ ... వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు ? వాళ్ళంతా ఏమవుతారో ? ఇలాంటి ఆలోచనలతో ఒక నిర్ణయానికి వచ్చి ఎప్పటికో నిద్రపోయాడు .....

తను States కి వెళ్ళనని, ఇక్కడే ఉంటానని అమ్మా నాన్నలతో చెప్పాడు హేమంత్ . వసంత . శ్రీ రాం ముందు బాధపడ్డా ... అమెరికా పేరు తో పెద్ద కొడుకు ఎలాగూ దూరంగానే ఉన్నాడు .. చిన్న కొడుకైనా కళ్ళముందు ఉంటాడని సంతోషపడి సమాధానపడ్డారు.తర్వాత ఏమి చెయ్యాలో హేమంత్ కి తెలియదు ..... " నడిచే దారి అస్పష్టంగా ఉన్నా ... తన గమ్యం మాత్రం స్పష్టం గా తెలుసు "...


*****************************************


2008,AUG 30TH,..SATURDAY,EENADU NEWSPAPER,.."EETHARAM" ... శీర్షిక ...


"యువత కి సందేశాలు సలహాలు యిచ్చేటంత అనుభవము వయస్సు నాకు లేవు .నేను "B.Tech., కంప్లీట్ చేసి 3 సంవత్సరాలు అవుతుంది , అప్పుడు నేను నా ఆశయం ఒక్కతే ఏర్పరచుకున్నాను 25 మంది అనాధలకి , food , shelter , education ఇవ్వాలని ఈ 3 యేళ్ళు చాలా ఇస్టం తో కస్తపడ్డాను. దాని ఫలితమే ఇప్పుడు మీరు చూస్తున్న VASANTA ORPHAN CHILDRENS WELFARE ORGANISATION . నా ఆర్గనైజైషన్ నుండి ఇప్పుడు 128 అనాధ పిల్లలు చదువుకుంటున్నారు చాలా త్రృప్తి గా ఉంది నాకు కాని, ఈ సేవలను ఇంకా వెనుకపడిన ప్రాంతాలకు విస్తరించాలని ఉంది , కానీ అదంత సులభము కాదని నాకు తెలుసు నాకెవరూ సహయ పడలేదు, ఈ 3 యేళ్ళు ఎంతో మంది అధికారులను పెద్దవాళ్ళని కలిసాను , నా ఆలోచనని మెచ్చుకున్నారు కాని , సహయము చెయ్యడానికి ముందుకు రాలేదు . అమ్మా నాన్న ల సహయంతోనే స్టార్ట్ చేసాను , ఇప్పుడు ఒక 6 మంత్స్ నుంచి డొనేషన్స్ కూడా వస్తున్నాయి , ఇదంతా ఎందుకు చెప్పానంటే ... మనం చేసే ఎలాంటి పని అయినా ముందు కష్టంగానే తోస్తుంది ... కానీ ఏదీ impossible కాదు , dedication ఉంటే ఏదైనా చెయ్యగలము ..... ఇది ఒక్కటే నేను చెప్ప్గలను ..... దాతలు ఎవరైన నా సంస్ఠ కి డొనేషన్స్ ఇవ్వాలి అని అనుకుంటే ఈ క్రింది నెంబర్స్ కి కాంటాక్ట్ చెయ్యడం మర్చిపోకండి .....

ఉంటాను ....హేమంత్ ...

ఇంటర్వ్యూ చదివిన పరమానందయ్య కి హేమంత్ అంటే గౌరవం పెరిగిపోయింది ... అంత చిన్న వయస్సులో అంత సేవ చేస్తునాడంటే అతనికి సహయపడకపోతే తన 60 యేళ్ళ జీవితం వృధా అనిపించింది ...తన కొడుకు అమెరికా నుండి పంపిన 15 లక్షలు తీస్కోని హేమంత్ ని కలసి విరాళం డొనేట్ చేసి ... "నేను ఎప్పుడో మదర్ థెరెసా ఫౌండేషన్ కి విరాళం డొనేట్ చేసినట్టు గుర్తు మళ్ళీ చేస్తుంది నీకేనయ్యా ... నీలాంటి వాడు జిల్లా కి ఒక్కడున్నా మన దేశం బాగుపడుతుంది , నిన్ను చూసి గర్వపడుతున్నాను ..." అని చెప్పి వెళ్ళిపోయాడు .

హేహేమంత్ ఈ మాటలకి పొంగిపోలేదు ... అసలు ఆ మాటలు అతని మీద ఏ ప్రభావము చూపలేదు ... మొహం లో ఎక్కడా గర్వం పాళ్ళు కనిపించలేదు... అతని దృస్టి అంతా ఆ 15 లక్షల చెక్కు మీదే ఉంది ... వెంటనే ఫోన్ చేసి ..." మనం కరీం నగర్ లో కూడా మన ఆర్గనైజైషన్ స్టార్ట్ చెయ్యబోతున్నాం 15 లక్షల పెట్టుబడితో ... డిస్ట్రిక్ట్ కలెక్టర్ appointment అర్జెంట్ గా తీస్కోండి .." అని కట్ చేసాడు ...