Keep Smiling.....:)
"వ్యాకరణం రాజబాట వేస్తుంది.వాడుక పిల్లబాట తొక్కుతుంది"అని కాళోజి అన్నట్టు,నా భాష తెలుగు,యాస తెలంగాణ.నేను రాసేదాంట్ల english,తెలుగు రెండూ ఉంటయ్.నేనెట్లైతె మట్లాడ్తనో,అట్లనే రాస్తా...."

Friday, March 5, 2010

నేను చేసిన "టమాట పప్పు"


వంట చేయడం మనకి రాకపోయినా,.చేసిన వంటకి వంకలు పెట్టడం లో మనం ముందు ఉంటాం..వంట చేయటం అల్కటి పని అని,దాన్ని సై చూసి చెప్పడం చాల కష్టమైన పని అని,..దానిలో మనమే గొప్ప అని మురిసిపోయిన సంధర్బాలు మస్తు ఉన్నాయి..
"వివ్విగాడు(మనమే లెండి) నీ కూరని మెచ్చుకుండా?!ఇంకేంది నీకు వంట వచ్చేసినట్టే...",.."వాడు certificate ఇచ్చినంక,ఇగ doubt లేదు,కూర super ఉంటుంది..",..ఇట్లాంటి మాటలు మా వాళ్ళు వాడేవాళ్ళు(వాడుతున్నారు కూడా) అంటే మన జిహ్వ గొప్పతనం తెలుస్తుంది కదా..!!
ఇగ మన సొంత డబ్బా జర సేపు ఆపేస్తే,నాకు నిజంగా వంట రాదు సరికదా,.కమస్కం,..టే,కాఫీ,.ఇట్లాంటివి పెట్టడం కూడా రాదు..ఇంకా చెప్పాలంటే ఉప్పు కి,వంట సోడా కి పెద్ద తేడా తెలియదు..అన్నీ కలిపి ఇస్తే ఆమ్లెట్ మరియు రైస్ కుక్కర్ లో అన్నం మాత్రం చేయడం వచ్చు....హా,మనకి ఇంకోటి చేయడం కూడా వచ్చు..అదే Noodles..:)...

ఇగ ఒక రోజు అమ్మ,నాన్న కలిసి ఊరికి పోయిండ్రు...ఎప్పుడు అమ్మ వాళ్ళు ఊరికి పోయినా నాకోసం ఒక రెండు రోజులకి సరిపోయేంత చికెనో,మటనో చేసి వెళ్తుండే...కాని,ఈ సారి అనుకోకుండా వెళ్ళడంతో ఏమి చేయలేదు..వాళ్లు సాయంత్రం వెళ్ళారు..ఆ రాత్రికి నాకు తిండికి ఏం డోకా లేదు.ప్రొద్దున చేసిన కూరలతో సరిపెట్టుకున్నా.....
ప్రొద్దున్నే లేచాను..మనకి Brush చేయగానే Tiffin కడుపులో పడాలి..ఆ రోజు మనమే చేసుకోవాలి అని స్నానం chesi నాకు తెల్సిన ఏకైక విద్య..అదే Noodles చేసుకొని తిన్నాను..

Tiffin తిన్నాం కదా,.ఇగ హాయిగా టీవీ చూస్తూ,పేపర్ చదువుతూ కూర్చున్నాను..అన్నం,కూరలు ఏమి లేవు అని తెలిసినా..అన్నం రైస్ కుక్కర్ లో అయిపోతుంది.ఇగ కూరలు మా పక్క గల్లి లో ఉన్న కర్రీ పాయింట్ లో తెచ్చుకుందాం అనుకున్నాను..11.30 అయ్యాక కర్రీ పాయింట్ కి వెళ్ళాను..ఆడ చూస్తే అది బందు ఉంది..ముందు బాగా తిట్టుకొని తర్వాత పోనీతీ మన తెలంగాణా కోసమే కదా బందు పెట్టింది అని ఇంటికి వచ్చి రైస్ కుక్కర్ లో బియ్యం,నీళ్ళు పడేసాను..
ఆమ్లెట్ వేసుకుందాం కష్టపడి అని చూస్తే గుడ్లు లేవు,..అవి తెచ్చుకుందాం అంటే షాప్స్ బందు..పోనీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం అంటే బస్సు లు బందు...."అంతా రామ మయం...." పాట లెక్క "అంతా బందు మయం..." అయిపోయింది...
వెంటనే మా అక్క కి ఫోన్ చేసి పరిస్థితి చెప్పి.."బాగా అల్కగా చేయొచ్చే కూర ఏంది"? అని అడిగాను....
"టమాట" వెంటనే చెప్పింది..
"యాక్" నాకు టమాట అంటే చిరాకు...ఏ వంకాయ టమాటనో,టమాట కీమానో,..ఇట్లా వేరే కూరలు కలిసి ఉంటె టమాట తింటాను గాని..ఒక్క టమాట అంటే మనకి పోదు....
"అది తినను కదా,..ఇంకా వేరే ఏదన్నా చెప్పు" అన్నాను..
ఎంత కాలు,చెయ్యి పడిపోయినా సింహం గడ్డి తినదు కదా!!..మనం కూడా అంతే..మధ్యాహ్నం 1 అవుతుంది..,ఆకలి దంచుతుంది..అయినా No Compromise...

సరే "టమాట పప్పు" చేసుకో అంది..గుడ్డి లో మెల్ల లెక్క ఇది బాగానే ఉంది కదా అనుకోని ఎట్లా చెయ్యాలో procedure మొత్తం నాకు sms చేయమని చెప్పాను..ఒక 4 msgs లో ఎలా చెయ్యాలో సవివరంగా పంపించింది మా అక్కయ్య..
ముందు 4 మిర్చీ,1 ఉల్లిగడ్డ,కొంచెం కళ్యామాకు,5 టమాటోలు..అన్ని కోసిపెట్టుకొని కుక్కర్ లో నూనె వేడి చేసి,..ఇవన్ని ఆ నూనె లో వేసి ఉప్పు,పప్పు etc వేసి సగం గ్లాస్ పెసర పప్పు వేసి,కొంచెం వేగాక 2 గ్లాసుల మంచి నీళ్ళు పొయ్యాలి.కుక్కర్ మూత పెట్టి,2 విసిల్స్ రాగానే ఆపెయ్యాలి..
అంతే..టమాట పప్పు రెడీ....
"ఓస్..ఇంతే కదా"! ఆనుకొని చేయడం ప్రారంబించాను...మిరపకాయలు,టమాటలు,ఉల్లిగడ్డ కోయడం అయ్యేసరికి....గోడ మిద photo లో ఉన్న మా తాతయ్య,నాన్నమ్మ దిగి వచ్చినంత పని అయింది..సంగీతం,సాహిత్యం..వంట చేయడం ఇవ్వనిటితో పాటు కూరలు కోయడం కూడా ఒక కళ అని అప్పుడు అర్థం అయింది..
మంచి పాటలు వింటూ కూర చేసుకుందాం అనుకొని నా system లో పాత పాటలు పెట్టుకున్నాను.......
"ఆడుతు పాడుతు పనిచేస్తుంటే......"
"ఆహా..ఏం పాట అనుకుంటూ స్టవ్ వెలిగించి.కుక్కర్ పెట్టి,నూనె వేసి,..sms లో ఉన్నట్టే అన్ని వేసాను.ఉప్పు,పసుపు..ఆ పోనిత్తుల డబ్బాలో ఉన్నవన్నీ వేసాను ఎందుకైనా పనికొస్తాయని.....!!
ఇగ నా పరేషాన్ అంతా అప్పుడు మొదలైంది!!పెసర పప్పు ని ఎట్లా గుర్తుపట్టాలి??"అనుకున్నాను....మొత్తం డబ్బాలు వెతికితే 4 రకాల పప్పులు కనిపించాయి.అందులో రెండు కావు అని ఎందుకో అనిపించి పక్కకు పడేసాను..ఇంకా రెండిటిలో మంచి రంగు లో ఉన్న పప్పు ని తీసుకున్నాను..
అక్కయ్య గ్లాస్ అని చెప్పింది కానీ చిన్నదో,పెద్దదో చెప్పలేదు!ఎలా?!..మళ్లీ ఫోన్ చేద్దాం ఆనుకొని...ఎందుకులే అని ఊరుకున్నా..ఒక పెద్ద గ్లాస్,సగం కంటే ఎక్కువ పప్పు తీసుకొని ఆ వేగుతున్న వాటిలో పోసి..కొంచెం సేపు అయినంక,..2 గ్లాసెస్..ఈ సారి చిన్న గ్లాస్ తీసుకొని అందులో పోసి...కుక్కర్ మూత పెట్టి..."its so simple"..ఆనుకొని బయటకొచ్చిన...

అప్పటికే 2.30 అయింది..ఆకలి దంచుతుంది..
"ఈ వేళ నాలో ...ఎందుకో ఆశలు..లోలోన ఏవో..."...
"ఆహా!సుశీల గారి పాట వింటూ ఆకలిని కూడా మర్చిపోవచ్చు అనుకుంటుండగానే..ఒక విసిల్ వచ్చింది!!వెంటనే కుక్కర్ దగ్గరికి వెళ్లి..రెండో విసిల్ కోసం...examiner బయటకి ఎప్పుడు వెళ్తాడా అని చూసే student లా,లోపల ఉన్న భక్తులు బయటకి ఎప్పుడు వస్తారా అని గుడి బయట చూసే ముష్టివాడిలా,ఆరు బయట కుక్కలా,బావి కాడి కప్పలా...నోరు వెళ్ళబెట్టి చూస్తుండగానే..రెండో విసిల్ వచ్చింది..ఆవిరి పోయాక ఒక 2 నిమిషాలు ఆగి మూత తీయాలి....
"జయమ్ము నిశ్చయమ్మురా..భయమ్ము లేదు రా....",....
నేను చేసిన పప్పు success అని ఘంటసాల గారే వచ్చి చెప్తున్నట్టు అనిపించింది....పాట అయిపోతుండగా కుక్కర్ మూత తీయడానికి ప్రయత్నించాను...ఎంతకి రాలేదు..ఈ సారి కొంచెం గట్టిగా బల ప్రయోగం చేశాను...వచ్చింది...
"అనుకున్నదొక్కటి..అయినది ఒక్కటి...బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట...."..
..
నా టమాట పప్పు లో టమాట తక్కువ,పప్పు ఎక్కువ..ఆ పప్పు కూడా ఏందో ఒక తరీఖాల ఉంది..ఇగ మిరపకాయలు వగైరా..అన్నీ పైన తేలుతూ ఉన్నాయి..నీటి చుక్క లేదు!!
పోనితీ..మనకి చూడటం కాదు కదా..రుచి కావాలి ఆనుకొని,..అన్నం పెట్టుకొని..నా పప్పు ని plate లో పెట్టుకొని వెంకటేశ్వర స్వామి కి మొక్కుకొని మరీ ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్నా.......
"అంతా బ్రంతియేనా..జీవితానా వెలుగింతేనా..ఆశా..నిరాశేనా...."....పాట వస్తుంది...
ఆ పరిస్థితే నాది కూడా,....పప్పు లో ఉప్పు తక్కువ,కారం ఎక్కువ...నునే తక్కువ,మిర్చీ ఎక్కువ....అసలు నేను నా జీవితం లో ఎప్పుడూ తినని "టమాట పప్పు" ని చేసాను!!ఏం చేయాలో అర్థం కాక..దాన్ని పక్కన పడేసి...ఆవకాయ తో అన్నం తినేసాను!!!!
అంతా చెప్పినట్టే చేసినా,..నా స్వయంపాకం ఇంత ఘోరంగా ఎందుకు fail అయిందో మాత్రం అర్థం కాలేదు...!!!

సాయంత్రం మా అమ్మ వచ్చింది....నేను చేసిన కూర చూడు అని report card ఇస్తున్న L.K.G student లా పెట్టాను నా మొహం....
"ఇదేంట్రా??!!!" అని అడిగింది...
"టమాట పప్పు"!!!,..అది కూడా తెలిదా అన్నట్టుగా చెప్పాను....!!!
బాగా నవ్వీ...."ఇదేం పప్పు.?"!?!! అని అడిగింది...........
అప్పుడు అర్థం అయింది......
నేను వేసింది "పెసరి పప్పు" కాదు.."శనగ పప్పు" అని...

నా కవిత--2



అందమైన వెన్నెల్లో,..మిద్దె మీద పడుకుంటే..
చక్కనైన కూని రాగం,.మది తలుపులు తడుతుంటే...
చెరిగిపోని నీ జ్ఞాపకాలు,..చెక్కిలి గిలి పెడుతుంటే..
ఊహల్లో నీ శిల్పం,..కనులకి కాంతినిస్తుంటే,....
నేస్తమా,........నిన్ను మరిచేదెలా?!!..
చీకటి,...వెన్నెల,..చుక్కలు,..చంద్రుడు...,నేను....,నా ప్రేమ......నీ జ్ఞాపకాలు....
.....ఈ అనుభవానికి మించిన ఆనందమేది?!
.....ఇంతకన్నా అందమైన అనుభవమేది??!!