Keep Smiling.....:)
"వ్యాకరణం రాజబాట వేస్తుంది.వాడుక పిల్లబాట తొక్కుతుంది"అని కాళోజి అన్నట్టు,నా భాష తెలుగు,యాస తెలంగాణ.నేను రాసేదాంట్ల english,తెలుగు రెండూ ఉంటయ్.నేనెట్లైతె మట్లాడ్తనో,అట్లనే రాస్తా...."

Monday, January 25, 2016

అమ్మ-అమెరికా

"సగం తాగి పడేయొద్దని ఎన్ని సార్లు చెప్పాలి...మళ్ళీ దొరుకుతాయా? కొంచమన్న బుద్ధి పెడితే బాగుండు దేవుడు.."..
నేను పాలు వదిలేసినప్పుడల్లా వినిపించే మాట ఇదే..చిన్నప్పటినుండీ అదే మాట, అవే తిట్లు,..అదే శ్రుతిలో ఒకేలా తిట్టడం ఒక్క అమ్మలకే సాధ్యం ఏమో..!
   టీక్...టీక్...టీక్...శబ్ధంతో ఆలోచనల నుండి బయటకొచ్చి oven లో ఉన్న పాలు తీసి తాగబోయాను...తాగలి అనిపించదు...కాని తప్పదు..ఆకలి తీరటానికి పాలకన్నా సులువైన మార్గం ఇంకోటి లేదు..పాలు మొత్తం తాగాను...!! అమ్మ గుర్తొచ్చింది వెంటనే..!!
బయటకి వెళ్తుంటే నవ్వొస్తుంది చీమల వరుసలా వెళ్ళే వాహనాల మధ్యలో నేను..చుట్టూ మనుషులు కనిపించరు..కార్లే కనిపిస్తాయి..
"ఇక్కడ మనుషులు ఉండరు...machines మాత్రమే ఉంటాయి" అని నేను ఈ దేశానికి వచ్చే ముందు చెప్పిన స్నేహితుడిని రోజూ తలచుకుంటా ఈ సమయంలో....
మన దేశంలోనే నయం...మనుషులు, కుక్కలూ, పందులూ....కనుచూపులోనే వందల మంది జీవితాలని చూడొచ్చు....అందుకే నా దేశానికి అంత విలువ ఉందేమో.. !!
     ఆఫిస్ రాగానే ఆలోచనలన్నీ సషేశంగా ఆగిపోయాయి..ప్రతి ఒక్కరు నవ్వుతూ "hello, hii" అని పలకరిస్తారు...నాకు వాళ్ళని పట్టుకొని నేను నీకు ఎన్ని రోజుల నుండి తెలుసు చెప్పు అని అడగాలి అనిపించేది మొదట్లో...ఇప్పుడు నేనూ వాళ్ళలో కలిసిపోయాను..!!
ఎంతో అందమైన దేశం..ఎటు చూసినా పచ్చదనం, కాకపోతే అది కూడా వీళ్ళ నవ్వులాగానే ఉంటుంది జీవం లేనట్టు..!!
        "పైన ఇంకొంచం కూర పెట్టాను..అది కూడా కలుపుకొని తిను..పెరుగన్నం డబ్బా మొత్తం ఖాలి చేసెయ్..మళ్ళీ ఇంటికి తీసుకురాకు, మొత్తం తినాలి..అర్థం అయిందా.."బడికి వెళ్తుంటే సుప్రభాతం లాగా ప్రతిరోజూ ఇదే వినిపించేది అమ్మ...
ఇప్పుడు నా డబ్బాలో గిన్నెలు ఎక్కువ, కూరలు తక్కువ..!!
           సాయంత్రం ఇంటికి రాగానే నా పాలిట నక్షత్రకుడు phone చేసాడు..నేను ఎక్కడికీ రాను మొర్రో అంటున్నా...బలవంతంగా నన్ను తీసుకొని వెళ్ళడం వీడు కంకణం కట్టుకోకుండా చేసే పని...నాకు ప్రపంచం చూపిస్తున్నాను అనుకుంటాడు...వీడికేం తెలుసు నా ప్రపంచం ఎక్కడ ఉందో..!!
"బయటకి వెళ్దాం పద...pubకి వెళ్దామా...bowlingకి వెళ్దామా...??"
"నేను ఎక్కడికీ రాను...ఇవాళ వదిలెయ్ నన్ను" అన్నాను..యే mood లో ఉన్నాడో వదిలాడు తొందరగానే...!!
ఉదయం ఆలోచనలతో..రాత్రి phones తో..ఇదే జీవితం..అమ్మ కి phone చేసాను...lift చేయలేదు..పూజ లో ఉందేమో..!!
ఇంతలో చిన్ననాటి స్నేహితుడు whatsappలో message చేసాడు phone చేయమని...చేస్తూనే నేను ఎంత ఆనందంగా ఉంటున్నానో వాడే చెప్తున్నాడు....వీడికెలా చెప్పేది?!....సంతోషం అంటే మనం తిరిగే ప్రదేశాలూ,facebook checkins కాదని...!!
"చూస్తున్నా..చూస్తున్నా..మొత్తం అమెరికా చుట్టేస్తున్నావ్....నీకెంటి బాగ సంపాదిస్తునట్టు ఉన్నావ్..ఇంక పెళ్ళి చేసుకో మామా...settle అయిపోతావ్..నాకు కూడా అమెరికా రావాలని ఉందిరా...process చెప్పు..బాగా enjoy చెయ్యాలి వచ్చి..."
... వాడి మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని అనుకోలేదు..ఎందుకంటే...వాడికిది స్వర్గం..నాకు వాడు ఉంటున్నది స్వర్గం..దూరపు కొండలు నునుపు అని అందుకే అంటారేమో...
      ఎవేవో మాట్లాడుతూ ఉన్నాడు..."అమ్మా..ఇంకో రెండు దోసలెయ్.." అరిచాడు నాతో మట్లాడుతూనే....అప్పుడు చెప్పాను...
"ఇక్కడ అన్నీ ఉంటాయ్రా...అమ్మ తప్ప..."అని..
వాడికి అర్థం అయిందేమో...అమ్మ పిలుస్తుందిరా, మళ్ళీ మట్లాడుతా అన్నాడు..!!

17 comments:

shruthakeerthi said...

Nice one..

shruthakeerthi said...

Nice one..

Srikanth Yasa said...

Good one 👍🏻

manu said...

Awesome!! Miss my mom��

Unknown said...

Well described..good one!!

param said...

అమ్మ ఎప్పుడూ అమ్మే... తిట్టినా కూడా కమ్మగానే తిడుతుంది..

Unknown said...

చాలా బాగుంది

Unknown said...

Superb lines

vivek said...

Thank you so much everyone. :)

Gouthami said...

Superb!!!

Unknown said...

If it is literal. . It is good.
If it is emotional. .it is the best. .

Anonymous said...

Welcome back!

vivek said...

@sridhar dasari...thank you so much !!

vivek said...

@nachaki Welcome back to my blog and comments section :P :)

Unknown said...

If it is literal. . It is good.
If it is emotional. .it is the best. .

Unknown said...

ఎదో భయంతో కల లో లేచి చూస్తున్న నాకు మీ నాన్న గారి ఫేస్బుక్ పోస్ట్ గుర్తొచ్చి ఓపెన్ చేసాను. ఎందుకంటె నేను లాస్ట్ పడుకునే ముందు కామెంట్ చేసాను. దాని ద్వారా మీ ప్రొఫైల్, మీ ప్రొఫైల్ లో నుండి బ్లాగ్, అక్షర నిలయం, ఇప్పుడిలా అమ్మ గురించి. ఇప్పుడు అర్ధం ఐంది నేను బయపడిన కల మా అమ్మ గురించి.

Unknown said...

మధ్యలో మీ ప్రేమను, భానుమతి గారు, susheelamma గారు,కవిత అక్క,రంగనాయకమ్మ గారిని కూడా కలిసాను అన్న.ఇప్పుడు హ్యాపీ గా ఫీల్ అవుతున్నాను. మీ అక్షర నిలయం కు హైదరాబాద్ లో నా వాళ్ళ అయ్యే ఏదైన తప్పకుండ చేస్తాను.